Naga Chaitanya: ముద్దు సీన్ కోసం నాగ చైతన్య అంత సమయం తీసుకున్నాడా..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి, నాగచైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త పాయింట్స్‌తో రూపొందగా, ఇందులో సాయిపల్లవి డాన్స్ కూడా సినిమాలో చాలా హైలెట్ గా నిలిచాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో కనిపించాయి అంటూ చాలామంది సెలబ్స్ కామెంట్స్ చేశారు.
చిత్రంలో చైతు – సాయి పల్లవిల కెమిస్ట్రీతో పాటు లవ్ సీన్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఓ సీన్లో, అలాగే ‘ఏయ్ పిల్లా’ పాటలోనూ సాయి పల్లవి, చైతుకి ముద్దు పెడుతుంది. సాధారణంగా కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉండే సాయి పల్లవి ఇటీవల ముద్దు సీన్‌పై క్లారిటీ ఇచ్చింది. నేనెప్పుడూ కూడా ముద్దు సీన్లలో యాక్ట్ చెయ్యలేదు.. అలాంటి సీన్స్‌లో నటించను అని దర్శక నిర్మాతలకు ముందే చెప్పేస్తాను. సినిమాలో నేను నాగ చైతన్యను ముద్దు పెట్టుకోలేదు. అది కెమెరామెన్ ట్రిక్ అని పేర్కొంది.
అయితే సాయి పల్లవి ముద్దు పెట్టినప్పుడు చైతూ ముఖంలో భావోద్వేగాలు స్పష్టంగా వచ్చేంత వరకు సీన్ షూట్ చేశారట.దీని కోసం దాదాపు ఆరుగంటల సమయం పట్టిందని చెబుతున్నారు. చిత్రంలో కీలకమైన సన్నివేశం ఇదే కావడంతో సరైన ఎక్స్ప్రెషన్స్ వచ్చే వరకు చైతూని ఎవరు ఇబ్బంది పెట్టొద్దని శేఖర్ కమ్ముల సూచించాడట. అయితే ఈ సీన్‌కు సూపర్భ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర బృందం పడ్డ కష్టాన్ని మరచిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

