love story collections | మండే టెస్ట్ పాసైన లవ్ స్టోరీ.. 4వ రోజు మంచి వసూళ్లు..

love story movie collection day 4 | ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదలైనా కూడా తొలి రెండు మూడు రోజులు మంచి కలెక్షన్స్ వచ్చి.. నాలుగో రోజు నుంచి పరిస్థితి మారిపోతుంది. గోపీచంద్ సీటీమార్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. తొలి 3 రోజులు అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చిన ఈ సినిమా.. కీలకమైన సోమవారం నుంచి చేతులెత్తేసింది. దానికి ముందు ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత ఒక సినిమా సోమవారం కూడా మంచి వసూళ్లు తీసుకొచ్చింది. దాంతో నిర్మాతలు మాత్రమే కాదు బయ్యర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ సినిమా లవ్ స్టోరీ.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకు తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది.. కానీ కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా వచ్చాయి. తొలి మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. దాంతో పాటు ఓవర్సీస్లో 1 మిలియన్ క్రాస్ చేసింది ఈ సినిమా. అయితే వీకెండ్ వరకు వసూలు బాగానే వచ్చినా.. కీలకమైన నాలుగో రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరూ భయపడ్డారు. కానీ లవ్ స్టోరీ సినిమాకు మండే రోజు కూడా మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన 4వ రోజు అంటే.. తొలి సోమవారం దాదాపు 2.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 25 కోట్ల షేర్ వసూలు చేసింది లవ్ స్టోరీ. మరో 8 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ జోన్కు వస్తుంది. 33 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీసు బరిలోకి దిగింది లవ్ స్టోరీ. తెలంగాణ నేపథ్యంలో ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేసిన సినిమా ఇది. ముఖ్యంగా చైతు, సాయి పల్లవి కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు తీసుకొస్తుండడంతో.. ఈ వారంలోనే లవ్ స్టోరీ బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మీరు నవ్వితే ప్రపంచం ఆగిపోతుంది..దీపికాపదుకొనే స్టిల్పై అభిమాని
తండ్రి, కొడుకుల మధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్
మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు
Pawan Kalyan: దసరాకి పట్టాలెక్కనున్న భవదీయుడు భగత్ సింగ్..!
love story movie collections | మండే టెస్ట్ పాసైన లవ్ స్టోరీ.. 4వ రోజు మంచి వసూళ్లు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

