స్టార్ హీరోలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించడం అరుదైన విషయమే. మెగా హీరో సాయిదుర్గతేజ్ ఆ ఫీట్ చేశారు. ఆయన ‘సత్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. కలర్స్స్వాతి ఇందులో హీరోయిన్. విజయకృష్ణ వీకే దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌తో కలిసి విజయదుర్గ ప్రొడక్షన్స్ సంస్థ తొలి ప్రయత్నంగా ఈ షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించింది.
ఫిల్మ్‌ఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024 పోటీల్లో పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో ‘సత్య’ షార్ట్ ఫిల్మ్ పోటీ పడుతున్నది. ఈ సందర్భంగా సాయిదుర్గతేజ్ సోషల్‌మీడియా ద్వారా స్పందించారు. తాను నటించిన ‘సత్య’ షార్ట్ ఫిల్మ్‌ని చూసి ఓటు వేయాలని ఆయన ప్రేక్షకుల్ని కోరారు. మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్‌గా రూపొందిన ‘సత్య’ ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.