Sara Tendulkar Debut to B-Town | క్రికెట్ దేవుడిగా భావించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ తరుచుగా మీడియాలో పతాక శీర్షికలకెక్కుతున్నారు. వివిధ రకాల స్టైలిష్డ్ ఫొటోలు.. రోజువారీ కార్యకలాపాల సమాచారంతో సారా టెండూల్కర్ ఇన్స్టాగ్రాం ప్రొఫైల్ నిండిపోయి ఉంటుంది. ఆమె చూడముచ్చటైన ఫొటోలతో ఇన్‌స్టా ప్రొఫైల్ నింపేస్తుంటుంది.
గతేడాది డిసెంబర్లో మోడలింగ్‌లో అరంగ్రేటం చేశాక.. ఆమె త్వరలో బాలీవుడ్లో తెరంగ్రేటం చేస్తారన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఈ సంగతిని బాలీవుడ్ లైఫ్ వర్గాలు ధృవీకరించాయి. నటన పట్ల సారా టెండూల్కర్ చాలా ఆసక్తిగా ఉంటారని.. నటనకు సంబంధించిన పాఠాలు విన్నారని, కొన్ని బ్రాండ్ల కోసం నటించడానికి ఒప్పందాలు చేసుకున్నారని సమాచారం.
సారా టెండూల్కర్ ఎల్లవేళలా పబ్లిసిటీకి దూరంగా ఉంటూ లో కీ ప్రొఫైల్ ( low key profile ) మెయింటెన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు అకస్మికంగా తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేస్తుంటారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నటనలో ప్రతిభ మెరుగు పర్చుకున్న సారా టెండూల్కర్‌కు తల్లిదండ్రులు పూర్తి మద్దతుగా నిలిచారని సమాచారం. ఆమె ముంబైలోని ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్య, లండన్ యూనివర్సిటీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.