Saami Saami Song Promo | పుష్ప ‘సామి సామి’ సాంగ్ ప్రోమో అదిరింది..వీడియో
టాలీవుడ్లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్టులో ఒకటి పుష్ప (Pushpa). తాజాగా మేకర్స్ మరో సాంగ్ సామి సామి ప్రోమోను విడుదల చేశారు.

టాలీవుడ్లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్టులో ఒకటి పుష్ప (Pushpa). సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి’ పాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ రాబడుతోంది. తాజాగా మేకర్స్ మరో సాంగ్ సామి సామి ప్రోమోను విడుదల చేశారు.
‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి నా సామి’ అంటూ వచ్చే ఈ పాట క్లాస్, మాస్ టచ్ ఇస్తూ సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడం ఖాయమనిపిస్తోంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను మౌనికా యాదవ్ పాడింది. చంద్రబోస్ మరోసారి అద్బుతమైన లిరిక్స్ తో తెలుగుదనం ఉట్టిపడేలా రాసిన ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణలా నిలిచేలా కనిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక పాట నెట్టింట్లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో టాప్ ప్లేస్ దిశగా ముందుకెళ్తుంది. శేషాచలం కొండల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో వస్తున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. సునీల్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

