తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5, నో ఎగ్జిట్’. ఈ చిత్రాన్ని శౌరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శ్యామ్యూల్, షేక్ రహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు.
భరత్ కోమలపాటి (సన్నీ) దర్శకుడు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర టీజర్‌ను నాయిక నందిత శ్వేత అతిథిగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ…‘హారర్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. సాంకేతికంగా బలమైన చిత్రమిది’ అన్నారు.