S Thaman | మూడు కీ బోర్డులు విరగ్గొడితే కానీ భీమ్లానాయక్ ట్యూన్ రాలేదు: థమన్
భీమ్లా నాయక్ ప్రిరీలీజ్ ఈవెంట్ (Bheemla Nayak event) అట్టహాసంగా కొనసాగుతోంది. భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ ఏ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తూ..గూస్ బంప్స్ తెప్పిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (S Thaman) టీం గూస్ బంప్స్ తెప్పించేలా పాటలు పాడింది. ఈ సాంగ్ గురించి థమన్ మాట్లాడుతూ..
భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ మా అందరికీ చాలా చాలా ఫేవరేట్ సాంగ్. హీరో ఇంట్రో సాంగ్ చేయాలంటే ఒక పూనకం వస్తుంది. కానీ అది పవర్ స్టార్ కు చేయడమంటే రెండు మూడు కీ బోర్డులు విరగ్గొట్టి కానీ ఈ ట్యూన్ రాలేదు. ఈ పాట మాక్కూడా పెద్ద ప్రయోగం లాంటిది. గుంటూరు కారం ఆ యూనిఫారమ్..మంటెత్తిపోద్ది నేరాలు చేస్తే..సెలవు అంటు అనడు..శనాది వారం అంటూ పాడుకొచ్చాడు థమన్. ఈ పాటకు సింగర్ ఎవరనుకున్నపుడు రస్తిక్ వాయిస్ ఉండాలని రామ్ మిర్యాలను పెట్టామని చెప్పుకొచ్చాడు.
పాట రాసిన రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)మాట్లాడుతూ.. ఈ పాట తయారుచేసినపుడు మ్యాజికల్ మూమెంట్స్..మూడు పాటలు మూడు రోజుల తక్కువ వ్యవధిలోనే చేశాం. టైటిల్ ట్రాక్ ఉదయం కూర్చొని సాయంత్రానికి పూర్తి చేశాం. సాయంత్రం త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ వచ్చి పాట అని ప్రతీ అక్షరాన్ని ఎంజాయ్ చేస్తూ..నా చేతిలో ఉన్న ప్యాడ్ తీసుకొని ఆ లిరిక్స్ చదువుతూ..ఓ రచనకు ఆయనిచ్చేట్వంటి సమున్నతమైన సంస్కారం, గౌరవం అలాంటిదన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

