ఎట్టకేలకు వందవ సినిమా మైలురాయికి చేరుకున్నారు అగ్ర హీరో అక్కినేని నాగార్జున. ఒక స్టార్ హీరో వంద సినిమాలు పూర్తి చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. అదో బిగ్ ఎఛీవ్మెంట్. ఈ తరం హీరోలకైతే ఆ ఘనత అందని ద్రాక్షపండే. తన వందవ సినిమాను రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తారని ఇటీవల ఓ సందర్భంలో నాగ్ స్వయంగానే చెప్పారు. ఆ సినిమాకు ‘కింగ్ 100 నాట్ అవుట్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ టైటిల్‌తోపాటు మరో కొత్త టైటిల్ కూడా ఫిల్మ్‌వర్గాల్లో వినిపిస్తుంది.
అదే ‘లాటరీ కింగ్’. తను రాసుకున్న కథకు ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని దర్శకుడు రా.కార్తీక్ భావిస్తున్నారట. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సివుంది. సోమవారం ఈ సినిమా షూటింగ్‌ని సైలెంట్‌గా మొదలుపెట్టేశారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానున్నది. ఇదిలావుంటే.. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. అలాగే.. దేవిశ్రీప్రసాద్ కూడా సంగీత దర్శకునిగా ఖరారయ్యారని తెలుస్తున్నది. నాగచైతన్య, అఖిల్ కీలక పాత్రల్లో నటించనున్నట్టు సమాచారం.