Rukmini Vasanth | కన్నడ సినిమా కాంతారా చాప్టర్ 1 తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. ఈ అమ్మడు రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత అభిరుచుల గురించి షాక్ అయ్యే విషయాలు వెల్లడించారు. సినిమాలో కనకావతి పాత్రలో ఆమె చూపించిన పవర్, సౌత ఆడియన్స్‌కి తెగ నచ్చేసింది. కాంతారా2 తర్వాత రుక్మిణి మరింత ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే తాజాగా రుక్మిణి మాట్లాడుతూ, నటిగా మారడానికి ముందు మోడలింగ్ చేశానని, అది చూసే నాకు మొదటి సినిమా ఆఫర్ వచ్చింది అని వెల్లడించారు.
సప్త సాగరాల దాటి డైరెక్టర్‌కి ఆడిషన్ కోసం మెసేజ్ పంపించాను . అది చూసి ఆడిషన్‌కు పిలిచారు. ఆ మెసేజ్ చూడకపోయి ఉంటే ఆ అవకాశం రావడం ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి అని ఆమె తెలిపారు. అలాగే, సినిమాల్లోకి అడుగు పెట్టాలనే కోరికతో లండన్‌లో థియేటర్ ఆర్ట్స్ చదివినట్లు చెప్పింది. వ్యక్తిగత జీవితంపై రుక్మిణి మాట్లాడుతూ, తండ్రి ఆర్మీలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత, చెల్లి కోసం అన్నీ దగ్గర ఉండి చూసారని చెప్పారు. ఆమెకు బుక్‌లు చదవడం అంటే చాలా ఇష్టం . ఎక్కడా షూటింగ్ జరుగుతున్నా దగ్గరలో లైబ్రరీ ఉందా అని వెతకడం, అక్కడకు వెళ్లి చదవడం ద్వారా క్యారెక్టర్స్ లో ఎలా నటించాలో అర్థం చేసుకుంటుందని చెప్పారు.
కాంతారా 1 తర్వాత రుక్మిణి పాన్ ఇండియా ఆఫర్లను అందుకుంటున్నారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా విశేషంగా పెరిగింది. ఈ విజయంతో ఆమె భవిష్యత్తులో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. రుక్మిణి వసంత్ ..ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో అవకాశం పొందారు. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించడమే కాకుండా పాన్ ఇండియా లెవల్లో టాప్ రేంజ్ హీరోయిన్గా పరిచయం అవుతారని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో నిఖిల్‌తో స్ట్రైట్ మూవీ చేసిన కూడా, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గర అవుతుందని అంటున్నారు. రుక్మిణి భవిష్యత్తులో సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్గా నిలవనుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.