Ruhani Sharma | చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది సిమ్లా సుందరి రుహానీ శర్మ (Ruhani Sharma). ఆ తర్వాత తెలుగులో అందం, అభినయంతోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ నెట్టింట చాలా యాక్టివ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రుహానీ శర్మ ఒక్క ఫొటో పెట్టిందంటే చాలు.. కామెంట్స్, లైక్స్ వర్షంలా కురుస్తుంటాయి.
మోడ్రన్ డ్రెస్‌లోనైనా, సంప్రదాయ వస్త్రధారణలోనైనా అందరినీ ఇంప్రెస్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటూ తాజా ఫొటోలతో చెప్పేస్తుంది రుహానీ శర్మ. ఈ బ్యూటీ తాజాగా పల్లెటూరి అమ్మాయిగా మారిపోయింది. రెండు జడలతో లంగావోణీలో మెరిసిపోతూ.. మేకపిల్లను సరదాగా ఆడుతూ క్యూట్‌క్యూట్‌గా కెమెరాకు ఫోజులిచ్చింది. పల్లెటూరి అందం ఉట్టిపడేలా కనిపిస్తున్న రుహానీ శర్మ తాజా ఫొటోలు నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి.
ఏమా అందం ఏమా అందం భామ నీకు భువితో ఏమి సంబంధం.. అంటూ ఓ సినిమాలో వచ్చే పాటను తాజా స్టిల్స్‌తో మరోసారి గుర్తు చేస్తోంది రుహానీ శర్మ. రుహానీ శర్మ ప్రస్తుతం మాస్క్ సినిమాలో నటిస్తుండగా.. చిత్రీకరణ దశలో ఉంది.
లంగావోణీలో..
#RuhaniSharma pic.twitter.com/lNT0YeBG2m
— Star Gallery (@stargallery2020) June 11, 2024