రవితేజ కొత్త మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్..!

మాస్ మహరాజా రవితేజ మంచి జోరు మీదున్నాడు. ఈ ఏడాది క్రాక్ అనే సినిమాతో భారీ హిట్ కొట్టిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక కొత్త డైరెక్టర్ శరత్ మండవతో టాలీవుడ్ యాక్టర్ రవితేజ తన 68వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
రవితేజ బ్యాక్ లుక్ విడుదల చేసి ఈ మూవీ షూటింగ్ నేటి నుండి మొదలు కానున్నట్టు తెలియజేశారు. ఇక సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా, ఇందులో మెజిస్ట్రేట్ కార్యాలయం అందులో పని చేసే ఉద్యోగిగా రవితేజ కనిపిస్తున్నారు.ఈ సినిమాకు ‘ఎమ్మార్వో’ అనే టైటిల్ ను పరిశీలనలో వుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తాడని, ఈ సినిమాలో కూడా ఎర్రచందనం రవాణా లాంటి వ్యవహారాలు ఉంటాయని తెలుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. విరాటపర్వం చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని తీస్తున్నారు. కోలీవుడ్ కంపోజర్ సామ్ సీఎస్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

