టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR movie). పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ పాట కోసం జక్కన్న, తారక్, చెర్రీ టీం కొన్ని రోజులుగా ఉక్రెయిన్ లోనే ఉంది. తాజాగా ఆర్ఆర్ఆర్ ఫైనల్ అప్డేట్ బయటకు వచ్చింది. జక్కన్న అండ్ టీం ఉక్రెయిన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాట చిత్రీకరణ ను పూర్తి చేసింది. తాజా షెడ్యూల్ తో ఆర్ఆర్ఆర్ మొత్తం షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా రాజమౌళి, సెంథిల్ కుమార్ ఇతర టీం సభ్యులంతా కలిసి దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ టీం 10 రోజుల షూటింగ్ అనంతరం హైదరాబాద్ కు చేరుకుంది. ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ (Ram Chran) అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ (NTR ) కొమ్రం భీం రోల్ పోషిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్ (సుమారు రూ.400 కోట్లు) తో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో
బాలీవుడ్ భామ అలియాభట్ సీత పాత్ర పోషిస్తుండగా… హాలీవుడ్ నటి ఒలివియా మొర్రీస్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. శ్రియా శరణ్, అజయ్ దేవ్ గన్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ను అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇవికూడా చదవండి..
Regina Cassandra| అస్థిపంజరాన్ని పరీక్షిస్తున్న రెజీనా
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!