టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానున్నట్టు గత కొద్ది రోజులుగా చెప్పుకొస్తున్నారు. అయితే ఆ డేట్ మూవీకి సినిమా విడుదల కావడం కష్టమే అంటున్నారు.
పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీని దసరా కానుకగా విడుదల చేస్తానని రాజమౌళి అనౌన్స్ చేసినప్పటికీ.. చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడం కష్టమే అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ప్యాచ్ వర్క్ నడుస్తుందట. కొన్నిసన్నివేశాలకు సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుందట.
అక్టోబర్లో సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ ఎంతగానో భావించిన, కొంచె కష్టతరంగా మారిందట. అక్టోబర్ కు రిలీజ్ వాయిదా పడితే సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది.తాజా సమాచారం ప్రకారం చిత్రాన్ని క్రిస్మస్ కానుకగ లేదంటే రిపబ్లిక్డేకి కాని విడుదల చేయనున్నారని సమాచారం.