బాహుబలి సినిమాతో చరిత్రలు సృష్టించిన రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వారి ఆతృతకు తగ్గట్లే సినిమా కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ అక్టోబర్13న తప్పక వస్తుందని అందరు భావించారు.
కాని చిత్రాన్ని అక్టోబర్‌లో కాకుండా వచ్చే ఏడాది ఉగాదికి ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి రిలీజ్ అని అనుకున్నప్పటికీ ఆ సమయంలో పలు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ ఇప్పటికే వచ్చేశాయి. ఇప్పుడు వాటిని డిస్ట్రబ్ చేయడం ఇష్టంలేకనే సంక్రాంతి బరిలో కాకుండా ఉగాదికి తెచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే మూవీకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా రానుందని సమాచారం.
రీసెంట్గా ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ దోస్తీకి అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.