ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అరంగ్రేటం చేయనుంది.
భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్ గ్లింప్స్ ని ఇప్పటికే రిలీజ్ చేశారు. దీంతోపాటు మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇటీవల మరో టీజర్‌ని రిలీజ్ చేయగా అది సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మార్చింది. సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. అలాగే రెండు పాటలు కూడా వచ్చాయి. ఇటీవల విడుదలైన `ఆర్ఆర్ఆర్సోల్ ఆంథెమ్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, సినిమా థియేటరికల్ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ముందు ప్రకటించారు. కాని సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో ట్రైలర్‌ని వాయిదా వేశారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 9న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ట్రైలర్ ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.