RRR Movie | ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన మరో దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత గతేడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ‘బాహుబలి-2’ పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి తన పేరిట లిఖించుకుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి మాయ చేశాడు. ఈ చిత్రంతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ సాధించింది.
కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల్లోనూ ఆర్ఆర్ఆర్ సత్తా చాటుతుంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఆస్కార్‌కు పోటీ పడుతుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లో చోటు దక్కించుకుంది. దాదాపుగా ఆస్కార్ ఖాయం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాడు. ఇప్పటికే ఆస్కార్ తర్వాత అత్యుత్యన్నత పురస్కారంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలిచి తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచింది. ఇక ఆస్కార్ గెలవాలేగాని టాలీవుడ్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ వేడుక మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్లో జరుగనుంది. ఇక ఇప్పటికే రాజమౌళి, చరణ్, కీరవాణి అమెరికాలో ఉండగా.. మంగళవారం తారక్ కూడా లాండ్ అయ్యాడు. ఈ వేడుకలో నాటు నాటు సాంగ్ లైఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఇక అవార్డు వస్తే ఈ పాటకు స్టేజిపైన డ్యాన్స్‌లు కూడా వేస్తామని చరణ్ ఇటీవలే ఓ ఇంటర్వూలో తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ రీ-రిలీజ్ కాబోతుంది. మార్చి 10న ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తు్న్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరీ రీ-రిలీజ్లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు. అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు.