సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురువారం ప్రేక్షకుల ముందుకు రాగా, ఇది అభిమానులకి మాంచి కిక్ ఇచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఈ ట్రైలర్ ప్రస్తుతం రికార్డుల వేట మొదలు పెట్టింది. యూట్యూబ్ లో సెన్సేషనల్ వ్యూస్ అండ్ లైక్స్ తో సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతుంది.
ఆర్ఆర్ఆర్ ట్రైలర్ టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న ట్రైలర్ గా సంచలనం సృష్టించింది. కేవలం 6 గంటల 15 నిమిషాల టైం మాత్రమే తీసుకుని 10 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇది వరకు బాహుబలి 2 ట్రైలర్ 8 గంటల 7 నిమిషాల టైం కి 10 మిలియన్ వ్యూస్ ని అందుకోగా… వకీల్ సాబ్ ట్రైలర్ 12 గంటల 10 నిమిషాల టైంకి ఈ బెంచ్ మార్క్ ని అందుకుంది.
రీసెంట్ గా వచ్చిన పుష్ప ట్రైలర్ పది మిలియన్ వ్యూస్ అందుకునేందుకు 16 గంటల టైం తీసుకుంది.అయితే ఇది ఆరంభం మాత్రమే రానున్న రోజులలో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ ట్రయిలర్‌గా ఆల్‌టైమ్ రికార్డును సాధించింది. ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్‌కి దగ్గరగా ట్రయిలర్ దూసుకెళ్తుంది.ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్ నటిస్తున్నారు.