స్నేహం గొప్పతనంతో..హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించారు.
ఏప్రిల్ 12న విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘ఓ మై ఫ్రెండ్’ అనే లిరికల్ వీడియోను సీనియర్ నటుడు శివాజీ విడుదల చేశారు. స్నేహం గొప్పతనాన్ని తెలియజెప్పే పాట ఇదని, చిత్రీకరణ సమయంలో తన మిత్రులు గుర్తుకొచ్చారని దర్శకుడు విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.