‘ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ ఇది. ఇందులో నాలుగు ప్రేమకథలుంటాయి. నలుగురు అబ్బాయిల జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్లల్లో వచ్చిన మార్పేంటి? అనేదే ఈ సినిమా. అన్ని ఉద్వేగాలూ మిక్స్ అయిన పర్ఫెక్ట్ ఎంటైర్టెనర్ ఇది. పదిహేను నిమిషాల పతాక సన్నివేశం మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది.’ అని దర్శకుడు విక్రమ్‌రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోటీ కపడా రొమాన్స్’.
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రధారులు. బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్ బొజ్జం నిర్మాతలు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విక్రమ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘నా ఫ్రెండ్ లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని ప్రేరణగా తీసుకొని ఈ కథ తయారు చేశాను. సినిమా చాలా నాచురల్‌గా, వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అయితే.. శృతిమించిన రొమాన్స్ మాత్రం ఉండదు. యువతరం ఓ రేంజ్లో ఎంజాయ్ చేసే సినిమా ఇది.’ అని ఆయన చెప్పారు.