హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న తాజా సినిమా ‘ఛాంపియన్’. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోఉంది.
ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె చంద్రకళగా కనిపించనున్నారు. పాతకాలం నాటి సాంప్రదాయ దుస్తులు, చేతులకు గాజులు, నుదుట సిందూరంతో చాలా అందంగా కనిపిస్తున్నారు అనస్వర రాజన్. ఈ చిత్రానికి కెమెరా: మాధీ, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఆర్ట్: తోట తరణి.