Rocky Aur Rani ki Prem Kahani | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Rocky Aur Rani ki Prem Kahani Movie On Ott | రణ్వీర్ సింగ్ నుంచి వచ్చిన సినిమాల్లో పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన సినిమా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ తెరకెక్కించిన ఈ సినిమా నెలన్నర కిందట రిలీజై మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది.
Rocky Aur Rani ki Prem Kahani Movie On Ott | రణ్వీర్ సింగ్ నుంచి వచ్చిన సినిమాల్లో పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన సినిమా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ తెరకెక్కించిన ఈ సినిమా నెలన్నర కిందట రిలీజై మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. అయితే టాక్‌తో సంబంధంలేకుండా భీభత్సమైన కలెక్షన్లు కొల్లగొట్టాయి. కరణ్ బాలీవుడ్లో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాకుండా కొన్నేళ్లుగా మెగాఫోన్‌కు కూడా దూరంగా ఉన్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టి మెగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ ప్రియులు తెగ వేయిట్ చేస్తున్నారు.
కాగా తాజాగా ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో గతరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అంటే ఈ సినిమా చూడాలంటే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు అదనంగా రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్క సారి రెంట్ తీసుకుంటే కేవలం 48గంటల్లోపే సినిమాను చూసే చాన్స్ ఉంటుంది. వారం రోజుల వరకు ఇదే పద్ధతి కొనసాగే చాన్స్ ఉంది. ఇక ఫ్రీగా చూడాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే. ఆలియాభట్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

