Rocky aur Rani ki prem kahani | రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని ఫస్ట్ సింగిల్ రిలీజ్.. విజువల్స్ అదిరిపోయాయిగా..!
Rocky aur Rani ki prem kahani First Single | ఖాన్లు, కపూర్లు బాలీవుడ్‌ను ఏలుతున్న టైమ్‌లో రణ్వీర్ సింగ్ వాళ్లకు పోటీగా వచ్చి వాళ్ల సినిమాలకు ధీటుగా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టాడు. పుష్కర కాలం క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రణ్వీర్ ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు.
Rocky aur Rani ki prem kahani First Single | ఖాన్లు, కపూర్లు బాలీవుడ్‌ను ఏలుతున్న టైమ్‌లో రణ్వీర్ సింగ్ వాళ్లకు పోటీగా వచ్చి వాళ్ల సినిమాలకు ధీటుగా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టాడు. పుష్కర కాలం క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రణ్వీర్ ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఆయన రెమ్యునరేషన్ సైతం ఖాన్ల స్థాయిలో ఉండటం గమనార్హం. రామ్‌లీలా, భాజీరావ్ మస్తానీ, పద్మావత్, సింబా, గల్లీ భాయ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో బాలీవుడ్లో రణ్వీర్ క్రేజ్ శిఖరాలను అందుకుంది. కాగా గత రెండు, మూడేళ్లుగా రణ్వీర్ సింగ్‌కు అస్సలు కలిసి రావడం లేదు. విభిన్న జానర్లో సినిమాలు ట్రై చేస్తున్నా ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ హిందీ ప్రేక్షకుల్లో మాములు బజ్ క్రియేట్ చేయలేదు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు కరణ్ జోహర్ దర్శకత్వం వహించాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత కరణ్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టాడు. జూలై 28న విడుదల కాబోతున్న ఈ సినిమాపై మంచి బజ్ పెంచేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
తుమ్ క్యా మిలే అంటూ సాగే ఈ మెలోడియస్ పాట శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. రిలీజైన నిమిషాల్లోనే మిలియన్లలో వ్యూస్ సాధించింది. ప్రితమ్ స్వర పరిచిన ఈ పాటను అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ సాంగ్ మొత్తం మంచులోనే షూట్ చేశారు. ముఖ్యంగా రణ్వీర్, ఆలీయాల కెమెస్ట్రీ అద్భుతంగా కుదిరింది. వయాకామ్18 స్టూడీయోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను రూపొందించాడు. కరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

