Keshava Chandra Ramavath | జబర్తస్థ్ ఫేమ్, నటుడు రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మించిన తాజా చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించగా.. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అన్నన్య కృష్ణన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నటుడు రాకింగ్ రాకేష్ చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో ప్రదర్శితమవుతుండగా.. ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు తానే టికెట్లను అమ్మాడు. సంధ్య టికెట్ కౌంటర్‌కు వెళ్లిన రాకేష్.. తన మొదటి సినిమా మొదటి టికెట్‌ను తానే స్వయంగా అమ్మారు. టికెట్స్ తీసుకుంటున్న ఆడియన్స్‌కి థాంక్స్ తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.