Robinhood | నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో నితిన్ తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు.
‘యాక్షన్, కామెడీ అంశాలు కలబోసిన పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఇది. నితిన్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. అత్యున్నత సాంకేతిక హంగులతో తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.