RimjimMovie | గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో ‘రిమ్జిమ్’.. ఆకట్టుకుంటున్న ‘అస్లీదమ్’ ట్యాగ్‌లైన్!
RimjimMovie | 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రిమ్జిమ్’. ‘అస్లీదమ్’ అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.
RimjimMovie | 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రిమ్జిమ్’. ‘అస్లీదమ్’ అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. స్నేహం మరియు ప్రేమ నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ కథను దర్శకుడు హేమ సుందర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. 90వ దశక నాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా, రియలిస్టిక్ టోన్‌తో ఈ సినిమా ఉండబోతోంది. సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం ఎంతో ధీమాగా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరికీ నచ్చేలా ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం,” అని తెలిపారు. ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, ఆయన పాడిన రెండు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే ఆయన పాడిన పాటలపై సోషల్ మీడియాలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అజయ్ వేద్ హీరోగా, వ్రజన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. AV సినిమాస్ మరియు సి విజువల్స్ బ్యానర్లపై జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చిత్ర వివరాలు:
బ్యానర్: AV సినిమాస్, సి విజువల్స్
నటీనటులు: అజయ్ వేద్, వ్రజన, రాహుల్ సిప్లిగంజ్, బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ తదితరులు.
నిర్మాతలు: జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు
దర్శకత్వం: హేమ సుందర్
సంగీతం: కొక్కిలగడ్డ ఇఫ్రాయిం
సినిమాటోగ్రఫీ: వాసు పెండం
ఎడిటింగ్: పెనుమత్స రోహిత్
పీఆర్ఓ: అశోక్ దయ్యాల
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

