వరంగల్: సంచలనాలకు కేంద్ర బిందువులా ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఆయన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘కొండా’. వరంగల్‌కు చెందిన రాజకీయ నేతలు కొండా మురళీ, సురేఖల జీవితం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్ర ప్రారంభోత్సవం కోసం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరంగల్ చేరుకున్నారు. ఇక్కడి వంచనగిరి గ్రామంలోని గండి మైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఆయన ఇక్కడ ఆచారాల ప్రకారం మైసమ్మకు మద్యం అందించారు.
ఈ ఫొటోలను షేర్ చేసిన ఆర్జీవీ ‘‘నేను వోడ్కా మాత్రమే తాగుతాను. కానీ మైసమ్మకు మాత్రం విస్కీ తాగించాను’’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ‘చీర్స్’ అంటూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Though I only drink Vodka, I made the Goddess Maisamma drink Whisky 😃 pic.twitter.com/rcwHc2DSde
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021
CHEERS! 🍾🍾🍾 pic.twitter.com/WXDMdZ4PcC
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021