సోమవారం 25 మే 2020
Cinema - Apr 04, 2020 , 17:31:17

వ‌ర్మ నువ్వు కాల‌జ్ఞానివ‌య్యా..

వ‌ర్మ నువ్వు కాల‌జ్ఞానివ‌య్యా..

పరిస్థితుల‌ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో రామ్‌గోపాల్ వ‌ర్మ దిట్ట అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి పరిస్థితి ముందే వ‌స్తుంద‌ని తాను ఊహించిన‌ట్టు వ‌ర్మ పేర్కొన్నాడు. 2018లో తాను వైర‌స్ అనే పేరుతో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  'సర్కార్' '26/11 ది ఎటాక్' చిత్రాల నిర్మాత పరాగ్ సంఘ్వీ ఈ సినిమాను నిర్మిస్తున్నార‌ని, పూర్తి వివ‌రాల కోసం ఫేస్ బుక్ లింక్‌ని క్లిక్ చేయండని 10/62/018న ట్వీట్ చేశాడు వ‌ర్మ. ఎబోలా కంటే భయంకరమైన వైరస్ ముంబయి నగరాన్ని వణికించే కథాంశం తో సినిమా తీయబోతున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు.

అంతేకాక 'ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన యువ‌కుడు వైర‌స్ అంటించుకొని ముంబైకి వ‌స్తాడు. ఈ వైర‌స్ వ‌ల‌న‌ ప్ర‌జ‌లంద‌రు ఒక‌రి నుండి మ‌రొక‌రు 20 అడుగుల దూరం ఉండాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తాయి. వైర‌స్ బారిన ప‌డి ల‌క్ష‌కి పైగా మృతి చెందుతారు. రాక‌పోక‌లు నిషేదం అవుతాయి. భయబ్రాంతులకు గురైన ముంబయి వాసులు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. వైర‌స్‌ని వ్యాప్తి చేస్తార‌న్న భ‌యంతో పారిపోయే వారిని కాల్చి వేయాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేస్తుంది. ఈ కథకు భయం ప్రేమ ఉత్కంఠ త్యాగం ఆశల్ని మేళవించి హ్యూమన్ డ్రామాగా సినిమా రూపొందించబోతున్నాం' అని వర్మ రెండేళ్ల క్రితం త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మ‌హ‌మ్మారిగా మారిన క‌రోనా కూడా వ‌ర్మ చెప్పిన‌ట్టే ఉండ‌డంతో నెటిజ‌న్స్ నువ్వు కాల‌జ్ఞానివ‌య్యా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు .

 కనిపించని పురుగు


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo