ముంబై : రిపబ్లిక్ డే సందర్భంగా ఈనెల 25న విడుదలైన ఫైటర్ (Fighter) మూవీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. వరుస సెలవలతో భారీ వీకెండ్ కలెక్షన్స్ రాబట్టిన ఫైబర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది.
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్ ప్రధాన తారాగణంగా సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీకి విమర్శకుల నుంచి మెరుగైన రివ్యూలు రావడం, మౌత్ టాక్‌తో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇక ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ ఏకంగా రూ. 85 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు వెల్లడైంది.
దీపికా పదుకోన్ రూ. 20 కోట్లు, అనిల్ కపూర్‌కు రూ. 15 కోట్ల వరకూ నిర్మాతలు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇక దేశీ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ. 22.5 కోట్లు వసూలు చేసిన ఫైటర్ నాలుగు రోజులకు రూ. 126.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.
Read More :