‘కార్తికేయ-2’తో అలరించిన జంట నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న చిత్రం ‘18పేజిస్’. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నన్నయ్య రాసిన కావ్యమాగితే, తిక్కన తీర్చెనుగా’ అనే లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం.
నిర్మాత మాట్లాడుతూ ‘గోపీసుందర్ చక్కటి స్వరాల్ని సమకూర్చారు .తాజాగా విడుదల చేసిన ఈ పాట మెలోడి సాంగ్గా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. డిసెంబరు 23న చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వసంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్ రాపర్తి, అశోక్ బండ్రెడ్డి.