Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నాడు. ఓ వైపు గేమ్ చేంజర్ కోసం డేట్స్ కేటాయిస్తూనే మరోవైపు బుచ్చి బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ తెచ్చిపెట్టిన క్రేజ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత లేటైనా గేమ్ చేంజర్ పూర్తయ్యాకే కొత్త సినిమా షూటింగ్లో అడుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇక ఆ సినిమా పూర్తయ్యేలోపు ఆర్సీ16 ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కథా చర్చలు పూర్తవగా.. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర మాండలీకంలో డైలాగులు చెప్పబోతున్నాడట. దాని కోసం బుచ్చి బాబు లోకల్ రైటర్ సహాయం తీసుకుంటున్నాడట. లోకల్ రైటర్ ఇచ్చిన సలహాల మేరకు డైలాగ్స్‌ను రాస్తున్నాడట. ఇక ఉప్పెనతో నేషనల్ అవార్డు గెలుచుకున్న బుచ్చి బాబుపై మరింత ఒత్తిడి పెరిగింది. విలేజ్ రూరల్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనుందట. ఈ సినిమాను మైత్రీ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. ఇక చరణ్ ముందుగా గేమ్ చేంజర్ తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్లో గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది.