Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
Rayavalasa | దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ మూవీ 'రాయవలస' చిత్ర యూనిట్ ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ అందించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో పాటు సరికొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ మూవీ ‘రాయవలస’ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ అందించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో పాటు సరికొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీ కృష్ణ జె నిర్మాతగా, ఎన్ఆర్ఐ డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంతో అమెరికా నుంచి కార్తీక్ జయంతి హీరోగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుండగా, శ్రీషా నులు ప్రధాన కధానాయికగా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌తో పాటు ఇటీవల ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
దసరా సందర్భంగా విడుదల చేసిన తాజా పోస్టర్లో హీరో కార్తీక్ జయంతి సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించగా, వెనుక అమ్మవారి రూపం పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేస్తోంది. గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమాను నటీనటులు, సాంకేతిక నిపుణుల అంకితభావంతో ఒకే షెడ్యూల్లో పూర్తి చేశారు. ఈ చిత్రంలో రాణి పాత్రలో శ్రీషా నులు సహజమైన నటనతో ఆకట్టుకోనున్నారు. ఈ సినిమాకు అర్జున్ బాల సంగీతం అందించగా, రాఖీ ఏ కథ, మాటలు రాశారు. వి.ఆర్.కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, గ్యారీ బి.హెచ్. ఎడిటర్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయడానికి ‘రాయవలస’ సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో కార్తీక్ జయంతి, శ్రీషా నులు, అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధరావు, కంచరపాలెం రాజు, సుహాసన్, వివేక్ వర్ధన్, మృదుల, గాంధీ, లక్ష్మణ్, లండన్ తదితరులు నటిస్తున్నారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాధిక జయంతి, నిర్మాత: గోపీ కృష్ణ జె, కథ, మాటలు: రాఖీ ఏ, సంగీతం: అర్జున్ బాల, ఛాయాగ్రహణం: వి.ఆర్.కె. నాయుడు (కిట్టు), ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్., ఫైట్స్: మల్లేష్ షాలియన్, కొరియోగ్రఫీ: రాజ్ పైడే, పీఆర్ఓ: సాయి సతీష్లుగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

