OTTలో రవితేజ ఖిలాడీ రిలీజ్ చేస్తారా..?
OTTలో రవితేజ ఖిలాడీ | ఖిలాడి సినిమాను ఓటీటీలో విడుదల చేయమని బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది నిర్మాతలు కలలో కూడా ఊహించని ఆఫర్.

ఒకే ఒక్క సినిమాతో రవితేజ మార్కెట్ మళ్లీ రయ్యిమంటూ పైకి లేచింది. గత ఏడాది వరకు ఈయన సినిమాలు 20కోట్ల మార్క్ అందుకోవడానికి కూడా అష్టకష్టాలు పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రూ.40 కోట్ల వరకు వచ్చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో రూ.38 కోట్ల షేర్ వసూలు చేసింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. క్రాక్ తర్వాత రవితేజ మార్కెట్ ట్రాక్ ఎక్కింది. అందుకే రాబోయే సినిమాలకు సంబంధించిన బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చింది. మే 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు దర్శక నిర్మాతలు. అయితే మరోసారి కరోనా వైరస్ ఉదృతంగా ఉండడంతో సినిమాను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే సినిమాను ఓటీటీలో విడుదల చేయమని బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది నిర్మాతలు కలలో కూడా ఊహించని ఆఫర్. రవితేజ సినిమాలు సూపర్ హిట్ అయితే 30 కోట్లు వస్తాయి. కానీ ఖిలాడి సినిమాకు ఏకంగా రూ.40 నుంచి 45 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కుల కోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రవితేజ నిర్మాతలు మాత్రం ఇంకా ఏమీ మాట్లాడడం లేదు. ఈ సినిమాకు 25 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అమెజాన్ ఏకంగా 45 కోట్ల ఆఫర్ ఇచ్చింది. మరి దీన్ని తీసుకుంటారా లేదంటే పరిస్థితులు చక్కబడే వరకు ఆగి థియేటర్ లోనే విడుదల చేస్తారా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
నెటిజన్ కామెంట్..హేమ రిప్లై ఇదే..!
సురక్షితంగా ఉండండి.. సంక్షోభం నుండి బయటపడుతాం : మహేశ్‌బాబు
కరోనా ఎఫెక్ట్.. తండ్రికి క్షవరం చేసినబండ్ల గణేష్
కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్
ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా ..!
అంత చేసినా చివరికి యువతిని కాపాడలేకపోయానంటూ సోనూసూద్ భావోద్వేగం
కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

