Ravi Teja Next Movie | ఊహించిన స్థాయిలో ధమాకా బాక్సాఫీస్‌ను ఊపేయడంతో రవితేజ ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమా దెబ్బతో అంతకు ముందు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చేసిన గాయాలు పూర్తిగా మాసిపోయాయి. ఆ తర్వాత నెల రోజుల గ్యాప్‌లోనే వాల్తేరు వీరయ్యలో మరో బంపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల బొమ్మలతో తిరిగి తన మార్కెట్‌ను పుంజుకునేలా చేశాడు. మొన్న విడుదలైన రావణాసుర డిజాస్టర్‌గా నిలిచిన ఆ ప్రభావం రవితేజ మార్కెట్‌పై ఏమాత్రం పడలేదు. ప్రస్తుతం రవన్న చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా రవితేజ మరో క్రేజీ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది.
ఐదేళ్ల క్రితం బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన రైడ్ సినిమాను రవితేజ రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అవినీతికి పాల్పడని ఓ ఐటీ అధికారికి, అక్రమంగా ఆస్తుల సంపాదించిన ఓ రాజకీయకుడిగా మధ్య సాగుతుంది. కాగా ఈ సినిమాను రవితేజ తెలుగులో చేస్తున్నాడని టాక్. రవితేజకు ధమాకా వంటి భారీ హిట్టిచ్చిన పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ఇప్పటికే డబ్బింగ్ హక్కులు కూడా ఈ సంస్థ దక్కించుకుందట. అంతేకాకుండా ఓ మాస్ కమర్షియల్ దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పాటు ఈగల్ సినిమా చేస్తున్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు దసరా స్లాట్‌ను బుక్ చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈగల్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్నాయి.