క్రాక్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం ఖిలాడి సినిమాతో అభిమానులను ఎంటర్ టైన్ మెంట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దీంతోపాటు మరో చిత్రాన్ని కూడా లాంఛ్ చేశాడు. రవితేజ త్వరలో నిర్మాతగా మారబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీ వర్క్స్ బ్యానర్ పై రవితేజ త్వరలోనే ఓ సినిమా చేయనున్నాడన్న వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ రవితేజ సినిమా చేసే ఏ హీరోతోననే కదా మీ డౌటు. మలయాళ హీరోతో సినిమా చేయనుండగా..రెండు భాషల్లో ఈ చిత్రం సాగనుందట. రవితేజ చిన్న బడ్జెట్ సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులతోపాటు సిల్వర్ స్క్రీన్ మూవీస్ కూడా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి రవితేజ నిర్మాతగా మారి ఎలాంటి సక్సెస్ ను అందుకున్నాడో చూడాలి.