Raviteja 77 | మాస్ మహారాజా రవితేజ, క్లాస్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్లో సరికొత్త చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాకు #RT77 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు మేకర్స్. రిపబ్లిక్ డే కానుకగా సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సినిమా అధికారిక టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం.
సాధారణంగా శివ నిర్వాణ సినిమాల్లో ఉండే సున్నితమైన ప్రేమకథల కంటే భిన్నంగా, ఇది ఒక పవర్ఫుల్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. తన కూతురిని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి చేసే పోరాటం, అతని విముక్తి ప్రయాణం చుట్టూ ఈ కథ నడవనుంది. ఇందులో రవితేజ సరసన హీరోయిన్గా ప్రియా భవాని శంకర్ నటిస్తుండగా, తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి విజయాల తర్వాత ‘ఖుషి’తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న శివ నిర్వాణ, ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (BMW) సినిమాతో సందడి చేసిన రవితేజ, ఇప్పుడు ఈ సరికొత్త మాస్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
#RT77 @RaviTeja_offl #RaviTeja’s Next Up ! @ShivaNirvana @MythriOfficial ! Exciting & Worth Waiting !! pic.twitter.com/FnLwaKaxhr
— BA Raju’s Team (@baraju_SuperHit) January 25, 2026