Eagle Movie Review | ‘ఈగల్’ రివ్యూ.. రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే!
Eagle Movie | జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ.. సరదాగా ఆడుతూపాడుతూ హీరోగా పాతికేళ్ల కెరీర్ పూర్తిచేసేసుకున్నారు రవితేజ. ఆ మధ్య ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో వెంటవెంటనే విజయాలు అందుకున్న రవితేజ.. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో ఫ్లాపులను కూడా చవిచూశారు.
సినిమా : ఈగల్
తారాగణం: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, కావ్య థాపర్..
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ.. సరదాగా ఆడుతూపాడుతూ హీరోగా పాతికేళ్ల కెరీర్ పూర్తిచేసేసుకున్నారు రవితేజ. ఆ మధ్య ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో వెంటవెంటనే విజయాలు అందుకున్న రవితేజ.. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో ఫ్లాపులను కూడా చవిచూశారు. ఈ ఎత్తుపల్లాలు రవితేజ కెరీర్లో కామనే. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా రూపొందిన ‘ఈగల్’ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. నిజానికి సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాలవల్ల ఆ పోటీ నుంచి తప్పుకోవాల్సివచ్చింది. మరి ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా రవితేజకు మళ్లీ విజయాన్ని ఇచ్చిందా? ప్రచార చిత్రాలతో ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచిన ఈ సినిమా అందుకు తగ్గట్టుగానే ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు కథలోకెళ్లాలి.
కథ గురించి
‘ఈగల్’.. సహదేవ్వర్మ(రవితేజ) నడుపుతున్న ఓ నెట్వర్క్. అటు పోలీసులకూ, ఇటు నక్సలైట్లు, తీవ్రవాదులతోపాటు ఇతర దేశాలకు చెందిన కొందరు వ్యక్తులకు కూడా ఈ ‘ఈగల్’ ఓ లక్ష్యంగా ఉంటుంది. చిత్తూరుజిల్లా తలకోన అడవుల్లోని ఓ దూది మిల్లుతోపాటు, పోలెండ్‌లో కూడా సహదేవ్వర్మ నడుపుతున్న ‘ఈగల్’ యాక్టివిటీస్ బహిర్గతమవుతుంటాయి. ఈ వ్యవహారంపై జర్నలిస్ట్ నళిని రాసిన ఓ కథనంతో ఈ కథ మొదలవుతుంది. అది చిన్న కథనమే అయినా.. దేశంలో పెను ప్రకంపనాలకు దారితీస్తుంది. కారణం ఆ కథనం ‘ఈగల్’కి చెందినది కావడమే. అసలు ఈ సహదేవ్ వర్మ ఎవరు? ఈగల్ నెట్వర్క్ టార్గెట్ ఏంటి? తలకోన అడవులకూ ‘ఈగల్’కు గల సంబంధమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
కథా విశ్లేషణ
‘ఈగల్’ నెట్వర్క్ని పరిశోధించడం మొదలవ్వడంతో ఈ కథ మొదలవుతుంది. ఈ క్రమంలో పాత్రలు పరిచయమవుతుంటాయి. ఈ పరిచయాలతోనే కొంత కథ గడిచిపోతుంది. హీరో ఎలివేషన్లు, ‘ఈగల్’ ప్రస్తావన వస్తే చాలు భయపడే మనుషులు, ‘ఈగల్’ గురించి తెలుసుకునేందుకు అనుపమ చేసే ప్రయత్నాలు దాదాపు ప్రథమార్థం మొత్తం ఇదే. ఇక ద్వితీయార్థం మొత్తం యాక్షన్. అత్యున్నత నిర్మాణ హంగులు, నాణ్యమైన విజువల్స్‌తో సెకండ్‌హాఫ్ ఆసక్తిగా సాగుతుంది. ముఖ్యంగా పోలెండ్‌లో జరిగే కథ సినిమాకు ప్రధాన బలం. భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. అమ్మవారి విగ్రహం ముందు యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అనాలి. బలమైన కథకు బలమైన సన్నివేశాలు తోడవ్వడంతో ద్వితీయార్ధం ఆడియన్స్ కళ్లు తిప్పుకోలేరు. ఆయుధాలు, పత్తిపంట నేపథ్యాన్ని ప్రేమకథతో మిళితం చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
నటీనటుల నటన
రవితేజ గురించి చెప్పేదేముంది? నటుడిగా ఎప్పుడూ తను ఫెయిల్ కాలేదు. ఎప్పటిలాగే సహదేవ్ పాత్రలో ఒదిగిపోయి నటించారు రవితేజ . ఆయన యాక్షన్ అవతరం సినిమాకు ప్రధాన బలం. ద్వితాయర్థం ఆహార్యం కూడా కొత్తగా ఉంటుంది. ఇక హీరోయన్లు అనుపమ పరమేశ్వరన్ సినిమా మొత్తం కనిపిస్తే.. కావ్య థాపర్ మాత్రం ఫ్లాష్‌బ్యాక్ మాత్రమే పరిమితం అయింది. అయితే, ఇద్దరివీ కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలే కావడం విశేషం. నవదీప్ కీలకపాత్ర పోషించారు. వినయ్‌రామ్, మధుబాల, అవసరాల శ్రీను పరిథిమేర ఆకట్టుకున్నారు.
టెక్నికల్‌గా
దర్శకుడు సినిమాను కథలు కథలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రయత్నం కొత్తదేఅయినా ఫలితం మాత్రం ఇవ్వలేదనే చెప్పాలి. కథనం అయితే కొన్ని చోట్ల గందరగోళంగా అనిపిస్తుంది. అయితే,, స్టలిష్గా సాగే యాక్షన్ సన్నివేశాలు ఆ తప్పులన్నింటినీ చెరిపేస్తాయి. ఇక పీపుల్‌మీడియా అయితే డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టింది. ఆ ఖర్చంతా తెరపై కనిపించింది. మణిబాబు కరణం మాటలు బావున్నాయి. డేడ్జాండ్ నేపథ్య సంగీతం ప్రభావవంతంగా ఉంది. ఎడిటింగ్, కెమెరా విభాగాల్లో కూడా దర్శకుడు పాత్ర ఉండటంతో ైస్టెలిష్‌గా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. మొత్తంగా ైస్టెలిష్ యాక్షన్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్: పాత్రధారులు నటన, ద్వితీయార్థం, కెమెరా..
మైనస్ పాయింట్స్ : ప్రథమార్ధం
రేటింగ్ : 3.00/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

