కొన్నిసార్లు కొందరు హీరోలు చేయాల్సిన సినిమాలు మరో హీరో చేస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. అయితే కొన్నిసార్లు మాత్రం ఓ హీరో చేయాల్సిన టైటిల్ మరో హీరోకు వెళ్తూ ఉంటుంది. అప్పుడెప్పుడో మహేశ్‌బాబు చేయాల్సిన మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ కాస్త ప్రభాస్ తీసుకున్నాడు. కాటమరాయుడు కమెడియన్ సప్తగిరి చేయాలనుకుంటే చివరికి అది పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ రచ్చ చేయాలనుకున్నాడు కానీ దాన్ని రామ్ చరణ్ తీసేసుకున్నాడు. అలా ఓ హీరో కోసం అనుకున్న టైటిల్ మరో హీరో తీసుకుంటాడు అప్పుడప్పుడూ. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది.
తాజాగా రవితేజ కొత్త సినిమా టైటిల్ రామారావు ఆన్ డ్యూటీ అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇందులో గవర్నమెంట్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు మాస్ రాజా. శరత్ మండవ అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు రవితేజ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 20 శాతం పూర్తయిపోయింది. అయితే రామారావు అనే టైటిల్ బాలయ్య చేయాల్సిన సినిమా.
నాలుగేళ్ల కింద బాలయ్య 100వ సినిమా కోసం అనిల్ రావిపూడి ఈ టైటిల్ అనుకున్నాడు. రామారావు గారు అనే టైటిల్‌పై బాలయ్యతో సినిమా చేయాలనుకున్నాడు అనిల్. కానీ అనుకోని కారణాలతో ఈ చిత్రం ముందుకెళ్లలేదు. మళ్లీ ఆ తర్వాత రామారావు జోలికి ఎవరూ వెళ్లలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు రవితేజ సినిమా కోసం ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే బాలయ్య, రవితేజ మధ్య ఏదో జరిగిందని ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు బాలయ్య టైటిల్‌తోనే రవితేజ సినిమా చేస్తున్నాడు. మరి ఇదెలా ఉండబోతుందో..? క్రాక్ హిట్ కావడంతో అదే జోరులో వరస సినిమాలు చేస్తున్నాడు మాస్ రాజా. ఇప్పటికే రమేష్ వర్మతో ఖిలాడీ షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ పూర్తి చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
గోవా బీచ్‌లో విజయ్ దేవరకొండతో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
900 కోట్ల రూపాయల అప్పు చేసిన అమితాబ్