జనవరి 26 రవితేజ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకేరోజు అరడజన్ సినిమాల అప్డేట్స్..

Raviteja Birthday Special | చాలా సంవత్సరాల తర్వాత రవితేజ మళ్లీ నట విశ్వరూపం చూపిస్తున్నాడు. దాదాపు పదేళ్ల కింద ఆయన ఇంత బిజీగా ఉండేవాడు. కొన్ని సంవత్సరాలుగా వరుస సినిమాలు చేయడం మానేశాడు మాస్ రాజా. ఏడాదికి ఒక సినిమా.. లేదంటే రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి జోరు పెంచాడు. ప్రస్తుతం ఆయన అరడజను సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే జనవరి 26న పుట్టిన రోజు సందర్భంగా 6 సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ బయటకు రానున్నాయి. ఇది తెలిసి పండగ చేసుకుంటున్నారు రవితేజ అభిమానులు.
ఈ అరడజను సినిమాల్లో దాదాపు నాలుగు సినిమాలు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో రెండు పూర్తయ్యాయి కూడా. ఇన్ని సినిమాలకు ఒకేసారి డేట్స్ ఎలా ఇస్తున్నాడో తెలియదు కానీ.. అన్నింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాడు మాస్ రాజా. జనవరి 26 ఉదయం నుంచి రవితేజ సినిమాలకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ అభిమానుల ముందుకు రానుంది. ఖిలాడి సినిమా నుంచి ఫుల్ కిక్ ఇచ్చే మాస్ సాంగ్ విడుదల కానుంది. తర్వాత రామారావు ఆన్ డ్యూటీ టీజర్ అదే రోజు విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు.దాంతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాబోయే ధమాకా సినిమా అప్డేట్ చెప్పనున్నారు.
ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న సుధీర్ వర్మ రావణాసుర నుంచి కొత్త పోస్టర్ విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరావు సినిమా గురించి మేజర్ అప్డేట్ అదేరోజు అభిమానులకు చెప్పనున్నాడు దర్శకుడు వంశీ. వీటన్నింటితో పాటు మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కూడా జనవరి 26న ఉండబోతుంది. ఇలా ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు రవితేజ సినిమాలు అప్డేట్స్ వరుసగా రానున్నాయి. అన్నట్లు 2022లో రవితేజ నుంచి కనీసం మూడు సినిమాలు విడుదల కావడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Raviteja | రవితేజ ఖిలాడీ బిజినెస్‌కు రెక్కలు.. అన్ సీజన్లోనూ అదుర్స్..
నా కెరీర్లో అత్యంత దారుణమైన సినిమా అదే.. బాలయ్య టాక్ షోలో రవితేజ సెన్సేషనల్ కామెంట్స్
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Daksha nagarkar | మూడో సినిమాకే విలన్‌గా మారిన జాంబిరెడ్డి భామ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

