తెలుగు సినిమాలో ఆల్‌టైమ్ క్లాసిక్ లవ్‌స్టోరీగా నిలిచిపోయింది ‘గీతాంజలి’. నాగార్జున కథానాయకుడిగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ అజరామర ప్రణయగాథ పునః విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 28న నాగార్జున జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని 4కే ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయబోతున్నారు.
శ్రీపద్మిని సినిమాస్ పతాకంపై బూర్లె శివప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తనదైన కవితాత్మక శైలిలో మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ 4కే ఫార్మాట్లో ప్రేక్షకులకు సరికొత్త వీక్షణానుభూతిని అందిస్తుందని, ఈ సినిమాను థియేటర్లో చూడని నేటి తరం ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీని బిగ్స్క్రీన్పై ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం దక్కుతుందని మేకర్స్ తెలిపారు. గిరిజ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్నందించారు.