Ravi Teja | మాస్ మహారాజా రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు మరోసారి బిజీ షెడ్యూల్‌తో అభిమానులకు వరుస సినిమాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నటిస్తున్న ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ చివరి దశ షూటింగ్లో ఉండగానే, మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘రాజా రాజా చోర’ ఫేమ్ దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ ఓ వినోదాత్మక చిత్రంలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
హసిత్ గోలి శైలికి తగ్గట్టుగా హాస్యం, వినూత్న కథనం ప్రధాన బలాలుగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఈ నెలలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే, రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇరుముడి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల మేళవింపుగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులను ఈ పాట బాగా ఆకట్టుకుంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, కళ్యాణ్ చక్రవర్తి రచించిన సాహిత్యం, గాయకుడు అనంతు ఆలపించిన తీరు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాస్ హీరోగా గుర్తింపు పొందిన రవితేజను డివోషనల్ లుక్‌లో చూడటం అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది.ఒకవైపు ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు కొత్త సినిమాను ప్రారంభించే దిశగా రవితేజ అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. అయితే హసిత్ గోలి ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.