‘షాక్’ సినిమాతో హరీశ్శంకర్ని దర్శకుడ్ని చేసింది రవితేజ. ‘మిరపకాయ్’ సినిమాతో హరీశ్శంకర్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా నిలబెట్టింది రవితేజ. ఆ విధంగా హరీశ్‌శంకర్ కెరీర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం రవితేజ. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘మిరపకాయ్’ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. రవితేజతో ‘థమాకా’ లాంటి బ్లాక్బాస్టర్ అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించనుంది.
టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని ఈ రోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. హీరోయిజాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో హరీశ్‌శంకర్ దిట్ట. మరి మాస్మహారాజైన రవితేజను ఆయన ఎలా చూపించనున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఈ సినిమా మాస్‌ని లక్ష్యంగా చేసుకొని తెరకెక్కనున్నదని తెలియజేయటానికి ‘ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది’ అని కేప్షన్‌తో సినిమా ఎనౌన్స్మెంట్ స్టిల్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.