సోమవారం వచ్చిందంటే నామినేషన్ ప్రక్రియ ఏ రేంజ్లో సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే హౌజ్ నుండి 11 మంది వెళ్లిపోగా, ఈ వారం వెళ్లిపోవడానికి ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. ఈవారం నామినేషన్స్‌లో భాగంగా.. హౌస్ కెప్టెన్‌గా ఉన్న మానస్‌కి మినహాయింపు లభించింది. మిగిలిన ఏడుగురు ఈ నామినేషన్స్‌లో పాల్గొని నామినేట్ చేయాలని అనుకునే వారి కుండ పగలగొట్టి ఇద్దరిని నామినేట్ చేయాలని అన్నారు.
మొదటిగా యాంకర్ రవితో ఈ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టించారు బిగ్ బాస్. రవి ముందుగా సన్నీని నామినేట్ చేస్తూ ఇంట్లో సరిగా పని చేయడం లేదని చెప్పుకొచ్చాడు. నేను పనిచేయడం లేదని అంటున్నావ్ గా.. నువ్ నీకు ఇచ్చిన పని కాకుండా వాలంటీర్‌గా వచ్చి ఏం చేశావో చెప్పు. నువ్ చేయమని చెప్తే చేస్తావ్.. నేను చెప్పకుండానే చేస్తా.. అదీ నీకు నాకు ఉన్న తేడా?
నేను 4 డేస్ నుంచి వాష్ రూం క్లీన్ చేయలేదని నామినేట్ చేస్తున్నావ్ కదా.. నీకు తెలియదేమో ట్రక్ టాస్క్ ముగిసిన తరువాత వాష్ రూం నేనే క్లీన్ చేశా? అని చెప్పాడు సన్నీ. నువ్ ఇక నుంచి అయినా మారితే బెటర్ పర్సన్ అవుతావ్ అని రవి అనడంతో సన్నీ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. నువ్ మారు అని చెప్పినప్పుడు నేను మారిపోతే.. నేను నేను కాదు మామా అని అన్నాడు సన్నీ. ఇక కాజల్‌ని రెండో నామినేషన్లో భాగంగా నామినేట్ చేశాడు రవి.