చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం రష్మిక సొంతం. ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలు చేస్తుంది. తమిళం, హిందీ భాషలలోను పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడగా, కొందరు ఆమెని ఎంతగానో అభిమానిస్తున్నారు. మరి కొందరు దారుణమైన విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల రష్మిక నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక నవ్వుతూ, శర్వానంద్ సిగ్గుపడుతూ కనిపించారు. అయితే ఈ పోస్టర్ పైన ఓ నెటిజన్ రష్మికను ట్రోల్ చేస్తూ.. ‘దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారు’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపైన రష్మిక స్పందిస్తూ… ‘నా నటన కొసం’ అంటూ అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్మిక స్పందించిన తీరుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.