Baby | ప్రస్తుతం మూవీ లవర్స్ నోట ఎక్కువగా వినిపిస్తున్న సినిమా బేబి (Baby). ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand deverakonda), వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) డైరెక్ట్ చేయగా.. విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించాడు. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బేబి నేడు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రీమియర్ షోల నుంచి థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, రాశీఖన్నా బేబి ప్రీమియర్ షోకు హాజరైన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఫొటోలో ఉన్నది ఎవరనే కదా మీ డౌటు. రష్మిక మందన్నా (Rashmika Mandanna) బ్లూ జీన్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ క్యాప్, ఫేస్ మాస్క్ పెట్టుకుని బేబి సినిమాను సీక్రెట్‌గా చూసిందంటూ నెట్టింట ఓ టాపిక్ జోరుగా నడుస్తోంది. సెలబ్రిటీ ప్రీమియర్ షో నడుస్తున్న స్క్రీన్ 1లోకి గుట్టు చప్పుడు కాకుండా బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చిందట రష్మిక.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఇలా ఆనంద్ దేవరకొండ నటించిన బేబి చిత్రాన్ని రష్మిక సీక్రెట్‌గా చూసేందుకు కారణమేమై ఉంటుందా..? అని తెగ చర్చించుకుంటున్నారు ఈ స్టిల్ చూసిన నెటిజన్లు, మూవీ లవర్స్. చాలా కాలం తర్వాత ఫ్రెష్ ఫీల్ అందించేలా సాగే న్యూ ఏజ్ ట్రయాంగిల్ ప్రేమకథ బేబిని చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారని ట్రేడ్ సర్కిల్ టాక్.
బేబి నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఓ రెండు మేఘాలియా, దేవరాజా పాటలు నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతున్నాయి.బేబి చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ దీంతోపాటు గమ్ గమ్ గణేశాలో కూడా నటిస్తున్నాడు.