Rashmika Mandanna | వాటిని తలకెక్కించుకోకూడదంటున్న కన్నడ కస్తూరి రష్మిక
‘అవకాశాన్ని మించిన అదృష్టం వేరొకటి వుండదు’ అంటున్నది కన్నడ కస్తూరి రష్మిక మందన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్టార్డమ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక. ‘నా కంటే అందమైన అమ్మాయిలు.. తెలివైన అమ్మాయిలు.. బాగా నటించగలిగిన అమ్మాయిలు చాలామంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
Rashmika Mandanna | ‘అవకాశాన్ని మించిన అదృష్టం వేరొకటి వుండదు’ అంటున్నది కన్నడ కస్తూరి రష్మిక మందన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్టార్డమ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక. ‘నా కంటే అందమైన అమ్మాయిలు.. తెలివైన అమ్మాయిలు.. బాగా నటించగలిగిన అమ్మాయిలు చాలామంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
వారక్కడ, నేనిక్కడ ఉండటానికి కారణం కేవలం అదృష్టం. ఆ అదృష్టం వల్లే నాకు అవకాశాలు వచ్చాయి. నిరూపించుకోవాలనే ప్రయత్నం నాలో మొదలైంది. ఆ ప్రయత్నమే నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ విషయంలో నన్ను గుర్తించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.’ అని రష్మిక అన్నారు. ఇంకా మాట్లాడుతూ ‘జయాజయాలనేవి ఏ రంగంలోనైనా సహజం. వాటిని తలకెక్కించుకోకూడదు. ఆ ప్రభావం మనసుపై పడుతుంది. ఇక జీవితంలో ముందుకెళ్లలేం. అది పతనానికి హేతువు’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

