Rashmika Mandanna | మరాఠీ దుస్తుల్లో జానపద నృత్యం చేసిన రష్మిక.. వైరల్‌గా మారిన ప్రోమో
Rashmika Mandanna | ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలో కూడా సత్తా చాటుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. ‘పుష్ప’ చిత్రంతో ఈ భామకు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఈ అమ్మడు మరాఠీ టీవీషో ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. ఇందులో ఈ భామ మరాఠీకి చెందిన లవణీ అనే సంప్రదాయ జానపద నృత్యాన్ని పర్ఫార్మ్ చేసింది.
Rashmika Mandanna | ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలో కూడా సత్తా చాటుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. ‘పుష్ప’ చిత్రంతో ఈ భామకు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఈ అమ్మడు మరాఠీ టీవీషో ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. ఇందులో ఈ భామ మరాఠీకి చెందిన లవణీ అనే సంప్రదాయ జానపద నృత్యాన్ని పర్ఫార్మ్ చేసింది. ఈ సందర్భంగా టీవీ షో నిర్వాహకులు సంప్రదాయ మరాఠీ దస్తుల్లో రష్మిక మందన్న నృత్యం చేస్తున్న ఓ ప్రోమోను విడుదల చేశారు.
దీనికి మహారాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన దక్కింది. ‘మా షోలో రష్మిక మందన్న పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అచ్చమైన మరాఠీ అమ్మాయి వస్త్రధారణలో రష్మిక మహారాష్ట్రీయుల హృదయాల్ని గెలుచుకుంది’ అని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి టీవీషోలో జానపద నృత్యాన్ని చేయడం కొత్త అనుభూతినిచ్చిందని రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేసింది. ఈ నెల 26న ఈ షో ప్రసారం కానుంది. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

