క్యూటీ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టడం, అందంతో అందరినీ కట్టిపడేయడం కన్నడ సోయగం రష్మిక (Rashmika Mandanna)కు వెన్నతో పెట్టిన విద్య. డీగ్లామరస్ పాత్ర అయినా, కలర్ ఫుల్ రోల్ అయినా ఆ పాత్రకే వన్నె తెచ్చే టాలెంట్ ఈ భామ సొంతం. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే రష్మిక లుక్ వెనుక చాలా కష్టమే ఉందండోయ్. తాజాగా ఆమె ట్రైనర్ షేర్ చేసిన వీడియో చూస్తే ఈ విషయం నిజమేనంటారు.
కరణ్ సానే (Karan Sawhney) జిమ్‌లో ఇంటెన్స్ ట్రైనింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. యెల్లో షార్ట్, గ్రే ట్యాంక్ టాప్‌లో ఉన్న రష్మిక కరణ్ సానేను ఫాలో అవుతూ రన్నింగ్ సెషన్ (fitness training session) ప్రాక్టీస్ చేసింది. రష్మిక, నేను విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ట్రైనింగ్ సెషన్లో గట్టిగా ఒత్తిడికి లోనైనపుడు మీతో మీరు మాట్లాడుతున్నారా..? అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు కరణ్ సానే.
నాన్ స్టాప్‌గా పుల్ ఎనర్జిటిక్‌గా రష్మిక చేసిన వర్కవుట్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప..ది రైజ్‌లో శ్రీవల్లిగా నటించి మంచి హిట్టు కొట్టింది రష్మిక. శర్వానంద్‌తో కలిసి నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక పుష్ప ది రూల్‌తోపాటు హిందీ సినిమాలతో బిజీ కానుంది రష్మిక.