Rashmika Mandanna | అతిథి పాత్రలో..

తెలుగు చిత్రసీమలో రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది. అపజయమే లేకుండా కెరీర్లో దూసుకుపోతున్న ఈ సొగసరి అనతికాలంలోనే నంబర్వన్ హోదాను సొంతం చేసుకున్నది. ఈ ఏడాది బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న ఆమె మూడు సినిమాలను అంగీకరించింది. అరడజనకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె ఓ తెలుగు సినిమాలో అతిథి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ వార్ డ్రామా కథాంశంతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇండియా-పాకిస్థాన్ మధ్య 1964-65లో జరిగిన యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అతిథి పాత్రలో రష్మిక మందన్న కనిపించనున్నట్లు తెలిసింది. కథాగమనంలో కీలకంగా ఉంటూ నటనకు ప్రాముఖ్యమున్న పాత్ర కావడంతో రష్మిక మందన్న ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందని చెబుతున్నారు. త్వరలో రష్యాలో ప్రారంభమయ్యే షెడ్యూల్లో ఆమె పాల్గొననున్నట్లు సమాచారం. స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంకదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

