Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Rashmika | టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కడ కనిపించినా అభిమానుల్లో సందడి నెలకొంటోంది. తాజాగా అభిమానులతో సరదాగా ముచ్చటించిన రష్మిక.. తన భర్త విజయ్ దేవరకొండ ఇంకా తనకు నల్లపూసలు కొనివ్వలేదంటూ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి.
Rashmika | టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కడ కనిపించినా అభిమానుల్లో సందడి నెలకొంటోంది. తాజాగా అభిమానులతో సరదాగా ముచ్చటించిన రష్మిక.. తన భర్త విజయ్ దేవరకొండ ఇంకా తనకు నల్లపూసలు కొనివ్వలేదంటూ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే నల్లపూసలకు ప్రత్యేక స్థానం ఉంది. అవి వైవాహిక బంధానికి గుర్తుగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని విజయ్ దేవరకొండను నల్లపూసల గురించి ప్రశ్నించారు. ‘రణబాలి’ సినిమాలో రష్మికకు నల్లపూసలు ఇవ్వలేకపోయారు.. మరి నిజ జీవితంలో వదినమ్మకు ఇచ్చారా? అని అడిగారు.
దీనికి విజయ్ స్పందిస్తూ, పెళ్లికి సంబంధించిన చాలా ఆభరణాల సెట్లను తానే ఇచ్చానని చెప్పారు. అయితే అభిమాని మాత్రం నల్లపూసలు ప్రత్యేకమైన భావోద్వేగంతో ముడిపడి ఉంటాయని, వాటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని మరోసారి గుర్తుచేశారు. దీంతో విజయ్ కొంత తడబడినట్లు కనిపించగా, రష్మిక వెంటనే మైక్ అందుకుని అసలు విషయం చెప్పేశారు. వివాహం జరిగిన వెంటనే తన అత్తగారు, తన తల్లి నల్లపూసలు ఇచ్చారని రష్మిక వెల్లడించారు. తమ కుటుంబాల్లోని మహిళలు చాలా ముందుగానే ఈ సంప్రదాయాన్ని పూర్తి చేశారని సరదాగా చెప్పారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తనకు ఇంకా నల్లపూసలు కొనివ్వలేదని, వాటి కోసం తాను ఎదురుచూస్తున్నానని నవ్వుతూ కామెంట్ చేశారు. రష్మిక చేసిన ఈ సరదా వ్యాఖ్యలకు అక్కడున్న అభిమానులు నవ్వుకున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు ‘గీత గోవిందం’ సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిన ఈ జంట, ‘రణబాలి’ సినిమాలోనూ కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ బొబ్బిలి రణబాలిగా, రష్మిక జయమ్మగా కనిపించారు.ఇటీవల ఈ జంట అభిమానులతో మమేకమవుతూ పలు సందర్భాల్లో సరదాగా మాట్లాడుతున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పాటు, దసరా సందర్భంగా సినిమా చిత్రీకరణ జరుగుతున్న సింగనమల ప్రాంతానికి వెళ్లి అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలోనే నల్లపూసల ప్రస్తావన వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

