అల్లు అర్జున్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ నిర్దేశకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. బుధవారం ‘సోల్మేట్ఆఫ్ పుష్ప’ పేరుతో రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్లో డీ గ్లామర్ లుక్‌లో రష్మిక మందన్న వైవిధ్యంగా కనిపిస్తున్నది. చెవులకు కమ్మలు పెట్టుకుంటూ వినూత్నంగా తీర్చిదిద్దిన ఫస్ట్‌లుక్‌పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. శ్రీవల్లి అనే పాత్రలో రష్మిక మందన్న నటిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘కథానాయికగా రష్మిక మందన్నను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాం. అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్‌తో పాటు పాటలు, ప్రచారచిత్రానికి చక్కటి స్పందన లభిస్తున్నది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. మొదటి పార్ట్‌ను ఈ ఏడాది క్రిస్మస్కు విడుదలచేయబోతున్నారు. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావురమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సీఈవో: చెర్రీ.